News May 26, 2024
ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ హత్య

చింతలమానెపల్లిలో <<13313894>>దారుణహత్య<<>> జరిగింది. కోర్సిని గ్రామానికి చెందిన సదయ్య(34)కు 12 ఏళ్ల కిందట కవితతో పెళ్లి అయింది. సదయ్య అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య వదిలేసి వెళ్లిపోయింది. ఆ మహిళతో కూడా గొడవలు రావడంతో ఆమె అతడిని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కాగా గ్రామానికి వచ్చిన ఆ మహిళను కలవడానికి వెళ్లగా ఆమె సొదరుడు కుమార్ అతడిపై రాడ్‌తో దాడి చేసి చంపేశాడు.
Similar News
News February 23, 2026
నార్నూర్‌లో పెళ్లికి కట్నకానుకలు నిషేధం

నార్నూర్ మండలంలోని ఖైర్డాట్వ గ్రామంలో ఆదివారం గ్రామస్థులు కలిసి పెళ్లికి కట్నకానుకలను నిషేధిస్తూ తీర్మానించారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వధువు మడావి పూర్ణబాయి పెళ్లి కోసం 100 కుటుంబాలు కలిసి రూ.26,551 నగదు పొదుపు చేసి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ మడావి నరాంజి రావు, జంగు, మోతిరాం, గోవిందరావు, తుకారాం తదితరులు పాల్గొన్నారు.
News February 23, 2026
తలమడుగు: రూ 2,25,000 పలికిన లడ్డు

తలమడుగు మండలం బరంపూర్ కొండ పైన గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన ‘అన్నమయ్య లడ్డు’ వేలం పాట భక్తుల మధ్య ఉత్సాహంగా సాగింది. గ్రామానికి చెందిన ఎల్టీ గోవర్ధన్ రెడ్డి ₹2,25000 చెల్లించి ఈ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. స్వామివారి కృపతో లడ్డు దక్కడం తన అదృష్టమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
News February 22, 2026
కేటీఆర్ ఆదిలాబాద్ పర్యటన వాయిదా

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా పర్యటన వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల సోమవారం రావాల్సిన ఆయన, ఈ నెల 24 (మంగళవారం) జిల్లాకు రానున్నట్లు బోథ్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రకటించింది. షెడ్యూల్‌లో జరిగిన ఈ మార్పును పార్టీ శ్రేణులు, కార్యకర్తలు గమనించాలని కోరారు. మంగళవారం జరిగే పర్యటనను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.


