News May 26, 2024

ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ హత్య

image

చింతలమానెపల్లిలో <<13313894>>దారుణహత్య<<>> జరిగింది. కోర్సిని గ్రామానికి చెందిన సదయ్య(34)కు 12 ఏళ్ల కిందట కవితతో పెళ్లి అయింది. సదయ్య అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య వదిలేసి వెళ్లిపోయింది. ఆ మహిళతో కూడా గొడవలు రావడంతో ఆమె అతడిని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కాగా గ్రామానికి వచ్చిన ఆ మహిళను కలవడానికి వెళ్లగా ఆమె సొదరుడు కుమార్ అతడిపై రాడ్‌తో దాడి చేసి చంపేశాడు.

Similar News

News February 17, 2025

ADB: ఎస్సీ వర్గీకరణ బిల్లు సవరించాలని మంత్రికి వినతి

image

ఎస్సీ వర్గీకరణ బిల్లును సవరించాలని మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆదిలాబాద్‌లో మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. షెడ్యూల్ క్యాస్ట్ అని విభజించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలో చాలా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. రత్నజాడే ప్రజ్ఞ కుమార్, తదితరులున్నారు.

News February 16, 2025

ఆదిలాబాద్‌కు చేరుకున్న మంత్రి సీత‌క్క‌

image

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌, మెద‌క్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి న‌రేంద‌ర్‌రెడ్డి ప్ర‌చార సభ కోసం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీత‌క్క ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీ‌నివాస‌రెడ్డి దంపతులు మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ దండే విఠ‌ల్‌, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు ఆదివారం ఘన స్వాగతం పలికారు.

News February 16, 2025

లక్షెట్టిపేటలో భార్యను హత్య చేసిన భర్త

image

భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన లక్షెట్టిపేటలో జరిగింది. SI సతీశ్ వివరాల ప్రకారం.. గోదావరి రోడ్డుకు చెందిన గణేశ్ తన భార్య రాజ కుమారిని సిమెంటు ఇటుక, బండరాయితో కొట్టి చంపాడు. కాగా కొద్ది రోజులుగా గణేశ్ మద్యం తాగి వచ్చి భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని గొడవ పడేవాడన్నారు. ఆమె ఆదివారం తెల్లవారుజామున బాత్రూమ్‌కు వెళ్ళగా గణేశ్ వెనకాలే వెళ్లి తలపై కొట్టి చంపాడని ఎస్ఐ వెల్లడించారు.

error: Content is protected !!