News February 27, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైన పోలింగ్ వివరాలు

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కాగా గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదైన ఓటింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు. పట్టభద్రులు 20.3%, ఉపాధ్యాయుల 45.1% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.

Similar News

News November 21, 2025

HYD: GOVT ఉద్యోగులపై దాడి చేస్తే క్రిమినల్ కేసులు

image

ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకాలు కలిగించినా, వారిపై దాడులకు దిగినా కఠినచర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. పోలీసులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించినా, దాడులు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధినిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

News November 21, 2025

గజపతినగరం: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

image

గజపతినగరం మండలం ఎం.గుమడాం గ్రామానికి చెందిన గంట్యాడ అప్పలనాయుడు మానసిక స్థితి బాగోలేనందున ఈనెల 19న పురుగులు మందు తాగినట్లు భార్య సత్యవతి తెలిపారు. అతడిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడుకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News November 21, 2025

ఈ పంటలతో పురుగుల కట్టడి, అధిక దిగుబడి

image

నాటే దశ నుంచి కోత వరకు అనేక రకాలైన పురుగులు పంటను ఆశించడం వల్ల దిగుబడి తగ్గుతోంది. ఈ పురుగులను విపరీతంగా ఆకర్షించే కొన్ని రకాల ఎర పంటలతో మనం ప్రధాన పంటను కాపాడుకోవచ్చు. దీని వల్ల పురుగు మందుల వినియోగం, ఖర్చు తగ్గి రాబడి పెరుగుతుంది. వరి గట్లపై బంతిని సాగు చేసి పంటకు చీడల ఉద్ధృతిని తగ్గించినట్లే మరిన్ని పంటల్లో కూడా చేయొచ్చు. అవేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.