News February 27, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైన పోలింగ్ వివరాలు

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కాగా గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదైన ఓటింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు. పట్టభద్రులు 20.3%, ఉపాధ్యాయుల 45.1% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.

Similar News

News March 23, 2025

రేపు అధికారులతో మంత్రి సుభాష్ ప్రత్యేక సమావేశం

image

రామచంద్రపురం నియోజవర్గంలో సాగు నీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకునేందుకు ఈ నెల 24న ఇరిగేషన్ శాఖ అధికారులతో  మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం పట్టణంలోని లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఇరిగేషన్ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ (DC) అధ్యక్షులు, కార్యదర్శులు, రైతులతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News March 23, 2025

దేవాదుల పంప్ హౌస్‌ను సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు

image

హసన్‌పర్తి మండలంలోని దేవన్నపేట గ్రామంలో గల దేవాదుల పంప్ హౌస్‌ను ఆదివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు సందర్శించి మోటార్లను పరిశీలించారు. బీఆర్ఎస్ పాలనలోనే దేవాదుల నుంచి రైతులకు నీరు అందిందని.. ఈ కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు ను పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.

News March 23, 2025

క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ తగ్గుతుందా?

image

క్రెడిట్ కార్డుల వాడకం ఇటీవల ఎక్కువైంది. అయితే చెల్లింపుల ఊబిలో చిక్కుకున్నవారు కార్డు క్లోజ్ చేస్తుంటారు. అది మంచిది కాదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ‘క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడమనేది మన ఆర్థిక పరిస్థితి బాలేదనే విషయాన్ని సూచిస్తుంది. దాంతో సిబిల్ స్కోర్‌ తగ్గే అవకాశముంది. ఒకవేళ కార్డు నిలిపేయడం తప్పనిసరైతే మరో క్రెడిట్ కార్డు తీసుకున్నాక దీన్ని క్లోజ్ చేసుకోవడం బెటర్’ అని వివరిస్తున్నారు.

error: Content is protected !!