News February 19, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

➔ASF జిల్లాలో 12 మంది రిమాండ్. ➔కెరమెరిలో రేషన్ బియ్యం పట్టివేత. ➔బెజ్జూర్ చిన్నారులను పాఠశాలలో చేర్పించాలి. ➔SKZR: శివాజీ చిత్రపటానికి నివాళి అర్పించిన ఎమ్మెల్సీ. ➔దహేగాం: దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ➔రేపు కాగజ్ నగర్‌కు మంత్రి సీతక్క. ➔రెబ్బెన పోలీసులతో దురుసు ప్రవర్తన.. ఇద్దరికీ రిమాండ్.
Similar News
News March 15, 2025
బెడ్‌పై తిని పడుకుంటే రూ.4.7 లక్షల జీతం

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) బంపరాఫర్ ఇచ్చింది. 10 రోజులపాటు వాటర్ బెడ్‌పై పడుకుంటే రూ.4.7 లక్షల జీతం చెల్లిస్తోంది. వాటర్‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్‌తో స్పెషల్ బాత్ టబ్‌లు తయారు చేసింది. ఇందులో పడుకునే 10 మంది వాలంటీర్లకు ఫుడ్, డ్రింక్స్, ఫోన్ అన్ని సమకూరుస్తారు. ఈ 10 రోజులూ వారు ఆ బెడ్‌పై విశ్రాంతి తీసుకోవడమే పని. స్పేస్ జర్నీలో మానవ శరీరంపై ఉండే ప్రభావాలను అంచనా వేసేందుకే ESA ఈ ప్రయోగం చేపట్టింది.
News March 15, 2025
ప్రధాని పెద్దన్న లాంటివారే.. ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళ్తా: రేవంత్

TG: పదేపదే తాను ఢిల్లీకి వెళ్తున్నానంటూ BRS చేస్తున్న విమర్శలకు CM రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా.. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ప్రధాని పెద్దన్న లాంటివారే. కేంద్రం తీసుకొనే నిర్ణయాలు రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయి. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఇందులో రాజకీయం ఏముంది? ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళ్తా. ప్రతి కేంద్రమంత్రి వద్దకు వెళ్లి నిధులు తీసుకొస్తున్నా’ అని తెలిపారు.
News March 15, 2025
HYD: భారీగా పెరిగిన నీటి వినియోగం

హైదరాబాద్ మహానగరం రోజు రోజుకూ విస్తరిస్తుండటంతో నీటి వినియోగం కూడా భారీగా పెరిగింది. అవసరాలకు సరిపడా నీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో 1,12,926 ట్యాంకర్ల నీటిని ఉపయోగించగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 1,50,000 ట్యాంకర్లు బుక్ చేశారని జలమండలి ఫిబ్రవరి నెలకు సంబంధించి నివేదికలో పేర్కొంది.