News March 1, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ఆసిఫాబాద్ వాసులు భయపడుతున్నారు. ఆసిఫాబాద్ లో ఇవాళ, రేపు 36 నుంచి 38 °C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News November 10, 2025
నిర్మల్: రక్షణ కిట్లను అందజేసిన కలెక్టర్

నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులకు రక్షణ కిట్లను అందజేశారు. భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ఉపయోగపడతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు అవసరమయ్యే పరికరాలు ఈ కిట్లో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణీ, జడ్పీ సీఈవో గోవింద్ పాల్గొన్నారు.
News November 10, 2025
మార్కెట్కు సెలవు: పెను ప్రమాదమే తప్పింది!

ఢిల్లీలో జరిగిన భారీ పేలుడులో పెను ప్రమాదమే తప్పింది. బ్లాస్ట్ జరిగిన ఎర్రకోట మెట్రో సమీపంలోని చాందినీ చౌక్లో ఓల్డ్ లజపత్ రాయ్ మార్కెట్ ఉంటుంది. సహజంగా ఆ మార్కెట్ అత్యంత రద్దీగా ఉంటుంది. అయితే సోమవారం దానికి సెలవు కావడంతో ఆ ప్రాంతంలో జన సాంద్రత కాస్త తక్కువగా ఉంది. లేదంటే మృతుల సంఖ్య భారీగా నమోదయ్యేది. మార్కెట్ను రేపు కూడా మూసేస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజయ్ భార్గవ్ ప్రకటించారు.
News November 10, 2025
సంగారెడ్డి: మంత్రుల వీడియో కాన్ఫరెన్స్

రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు తీరును అడిగి తెలుసుకున్నారు. పత్తి కొనుగోలు ఎకరాకు 7 క్వింటాల నుంచి 12 క్వింటాలకు కొనుగోలు పెరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మంత్రులు తెలిపారు. కలెక్టర్లు ధాన్యం కొనుగోలను దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు.


