News April 1, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

image

ఆసిఫాబాద్ జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా బర్డ్ ఫ్లూ కారణంతో చికెన్ ధరలు తగ్గిపోయాయి. ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గడంతో మళ్లీ ధరలు ఊపందుకున్నాయి. దీంతో ప్రజలు చికెన్ కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గత నెలలో కేజీ చికెన్ ధర రూ. 120 ఉండగా ప్రస్తుతం దాని ధర రూ. 240కు చేరుకుంది.

Similar News

News October 20, 2025

దీపావళి వెనుక పురాణగాథలు తెలుసా?

image

నరకాసురుడిని శ్రీకృష్ణుడితో కలిసి సత్యభామ వధించిన మరుసటి రోజే దీపావళి జరుపుకుంటారని ప్రసిద్ధి. లంకాధిపతి రావణుడిని వధించిన శ్రీరాముడు ఇదే రోజున సీతతో కలిసి అయోధ్యకు చేరుకున్నారని, వారికి స్వాగతం పలుకుతూ ప్రజలు వేడుకలా నిర్వహించారని రామాయణ గాథ చెబుతోంది. ఈ వెలుగుల పండుగ దీపావళి మీ జీవితంలోని చీకట్లను తొలగించి సరికొత్త కాంతులను నింపాలని ఆకాంక్షిస్తున్నాం.
HAPPY DIWALI

News October 20, 2025

దీపావళి సమయంలోనే ఆలయానికి ఎంట్రీ

image

కర్ణాటకలోని చిక్కమగళూరులో కొండపై ఉన్న దేవిరామ్మ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. స్థానిక ఆచారం ప్రకారం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. ఈ ఏడాది నైట్ ట్రెక్కింగ్‌పై నిషేధం విధించి నిన్న, ఇవాళ దర్శనానికి అనుమతించారు. ఈ క్రమంలో నిన్న భక్తులు కొండను ఎక్కుతున్న సమయంలో డ్రోన్‌తో తీసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు రావడం గమనార్హం.

News October 20, 2025

జూబ్లీహిల్స్‌లోనే కాంగ్రెస్ పార్టీకి మొదటి దెబ్బ: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో BRS మొదటి దెబ్బ కొట్టబోతుందని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ నేత కేటీఆర్ అన్నారు. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్‌లో కొడుతామన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని విమర్శలు చేశారు. ఫిరాయింపు స్థానాల్లో ఉపఎన్నికలు ఖాయమని స్పష్టం చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికకు రావాలని సవాల్ విసిరారు.