News April 22, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో యాక్సిడెంట్

తిర్యాణి మండలం గిన్నెదరిలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిను యువకుడు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 22, 2025
ఖమ్మం జిల్లా ఇంటర్ రిజల్ట్స్

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 16919 మంది పరీక్షలు రాయగా 12996 మంది పాసయ్యారు. 76.81 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. ఫస్ట్ ఇయర్‌లో 17837 మందికి 12476 మంది పాసయ్యారు. పాస్ పర్సంటేజీ 69.94 శాతం.
News April 22, 2025
INTER RESULT: ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమంది పాసయ్యారంటే?

ఇంటర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 9,106 మంది విద్యార్థులు పరీక్షలు రాయంగా 4,967 మంది పాసయ్యారు. 54.55% మంది ఉతీర్ణత సాధించారు. సెకండియర్ ఇయర్‌లో 8,890 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 6,291 మంది పాసయ్యారు. 70.76% ఉతీర్ణత సాధించారు.
News April 22, 2025
ఇంటర్ రిజల్ట్స్: నల్గొండ పాస్ పర్సంటేజ్ ఇలా..

నల్గొండ జిల్లాలో ఫస్టియర్ పరీక్షను 13,977 మంది రాయగా 7931 మంది పాసయ్యారు. ఉత్తీర్ణతా శాతం 56.74 శాతంగా ఉంది. సెకండియర్‌లో 12,992 విద్యార్థులకు గాను 8,960 మంది పాసయ్యారు. పాస్ పర్సంటేజ్ 68.97శాతంగా ఉంది.