News April 19, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో 144 సెక్షన్: SP

ఆసిఫాబాద్ జిల్లాలో ఈనెల 20 నుంచి నిర్వహించనున్న ఇంటర్, పదవ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్ష కేంద్రాల వద్ద BNSS 163 (144) సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రశ్నాపత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇతరులు ఎవరూ కూడా పరీక్షా కేంద్రాల్లో ఉండరాదని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన వారిని తప్ప ఎవరినీ కేంద్రాలకు అనుమతించమన్నారు.
Similar News
News April 20, 2025
జేఈఈలో 299వ ర్యాంక్ సాధించిన సిద్దిపేట బిడ్డ

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం మగ్ధుంపూర్‌కు చెందిన అచ్చిన రాకేశ్ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటాడు. ఆల్ ఇండియా స్థాయిలో 299వ ర్యాంక్ సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. దీంతో రాకేశ్‌కు గ్రామస్థులతో పాటు, బంధువులు, మిత్రులు అభినందనలు తెలుపుతున్నారు.
News April 20, 2025
ఆత్మకూరు: ప్రైవేట్ నర్సింగ్ హోమ్ సీజ్

ఆత్మకూరులో కొన్ని రోజుల క్రితం ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో గర్భంలోనే చనిపోయిన శిశువు తల, మొండెం వేరుచేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు సర్జరీ చేసే చేసే క్రమంలో అనస్తీషియాను అర్హత లేని వ్యక్తులు ఇచ్చినట్లు విచారణలో తేలిందని జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా క్లినిక్‌ను సీజ్ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
News April 20, 2025
తాండూరులో సోమవారం ప్రజావాణి

తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని సిబ్బంది నవీన్ తెలిపారు. గత వారం హాలిడే సందర్భంగా ప్రజావాణి రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో గతవారం కొందరు వ్యక్తులు హాలిడే అని తెలియక ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లి తిరిగి వెనక్కి వచ్చినట్టు తెలిపారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా ఉంటుందని కార్యాలయ సిబ్బంది తెలిపారు.