News February 1, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: SP

శాంతిభద్రతల దృష్ట్యా ఆసిఫాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 28 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. జిల్లాలో పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు, సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలని కోరారు.
Similar News
News November 10, 2025
మెదక్: ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. మొత్తం 11 ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కొన్నింటిపై వెంటనే స్పందిస్తూ సంబందిత అధికారులతో మాట్లాడారు.
News November 10, 2025
టైక్వాండో పోటీల్లో కర్నూలు విద్యార్థుల విజయం

రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ టైక్వాండో పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ డా. ఏ. సిరి అభినందించారు. కడప జిల్లా రైల్వే కోడూరులో జరిగిన అండర్–19 విభాగంలో సుగందిని వెండి, ఇంద్రాణి కాంస్య పతకాలు గెలిచారు. ఏలూరులో జరిగిన అండర్–17 విభాగంలో లేఖ్యశ్రీ చందన వెండి, నక్షత్ర, రేవంత్ కాంస్య పతకాలు సాధించారు. క్రీడాకారులను ప్రోత్సహించిన కోచ్ షబ్బీర్ హుస్సేన్‌ను కలెక్టర్ అభినందించారు.
News November 10, 2025
వాళ్లు మూల్యం చెల్లించాల్సిందే: లోకేశ్

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ‘సిట్’ నిజాన్ని బట్టబయలు చేసిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ‘కల్తీ నెయ్యి కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు. ఇది కల్తీ కాదు.. హిందువుల నమ్మకం, భారత దేశ ఆత్మవిశ్వాసంపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వాళ్లు తప్పక మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఓం నమో వేంకటేశాయ’ అని ట్వీట్ చేశారు.


