News February 1, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: SP

image

శాంతిభద్రతల దృష్ట్యా ఆసిఫాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 28 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. జిల్లాలో పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు, సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలని కోరారు.

Similar News

News December 5, 2025

వారు మాత్రమే ఓటు వేసేలా చూడాలి: కలెక్టర్

image

ఓటరు జాబితాలో ఉన్న వారు మాత్రమే ఓటు వేసేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మొదటి విడత పోలింగ్ ఏర్పాట్లపై శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ పేపర్లను తప్పకుండా పంపించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

News December 5, 2025

ఎంఈవోలకు కరీంనగర్ కలెక్టర్ కీలక ఆదేశాలు

image

కరీంనగర్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎంఈవోలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రతి పదవ తరగతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ప్రత్యేక అధికారులు పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న స్పెషల్ క్లాసులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ బోర్డు పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 20 మంది పిల్లల ఉండాలన్నారు.

News December 5, 2025

NZB: రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు

image

రాష్ట్రస్థాయి సీనియర్ గర్ల్స్ ఇండియా రౌండ్ విలు విద్య పోటీలకు ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా విలువిద్య కార్యదర్శి గంగరాజు తెలిపారు. నిజామాబాద్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగారంలోని ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ రాజారం స్టేడియంలో నిర్వహించిన ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు హైదరాబాద్‌లోని కొల్లూరులో ఈనెల 7న ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాన్నారు.