News March 2, 2025
ఆసిఫాబాద్: జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ పోలీస్ యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా నిబంధనలను ఉల్లంఘించరాదని, బహిరంగ సభలు సమావేశాలు ప్రచారాలు చేయరాదన్నారు. అలాగే ర్యాలీలు, డీజే వంటివి వాటికి అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.
Similar News
News March 16, 2025
హుజురాబాద్‌లో నేడు రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు

హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ మైదానంలో ఈ నెల 16,17,18 తేదిలలో సీనియర్ తెలంగాణ రాష్ట్ర స్థాయి మెన్ హాకీకి చాంపియన్ షిప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు హుజురాబాద్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట రాజేంద్ర ప్రసాద్, అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు.
News March 16, 2025
ఖమ్మం: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చే నెల 20 నుంచి నిర్వహించనున్నట్లు డీఈఓ సోమశేఖర శర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. పది, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు.
News March 16, 2025
M.Pharmacy, M.Tech ఫలితాలు విడుదల

అనంతపురం JNTU పరిధిలో గతేడాది నవంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన M.Pharmacy 1, 2, 4వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R21), M.Tech 4వ సెమిస్టర్ సప్లిమెంటరీ (R21) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. Share It