News March 31, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

శాంతిభద్రతల దృష్ట్యా జిల్లాలో ఏప్రిల్ 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందని ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 30 పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉన్నందున జిల్లాలో డీఎస్పీ లేదా ఆపై పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు, సభలు నిర్వహించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిషేధంలో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలన్నారు.
Similar News
News November 28, 2025
జిల్లా ఉత్తమ పాఠశాలగా పెదపూడి MPP స్కూల్

పెదపూడి MPP పాఠశాల జిల్లాస్థాయి ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారులు విశ్వనాథం, సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. డీఈవో రమేష్ నేతృత్వంలోని అధికారుల బృందం మండలంలోని పలు పాఠశాలలను పరిశీలించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యాభివృద్ధిలో పెదపూడి పాఠశాల ముందంజలో ఉండటంతో ఈ గుర్తింపు లభించిందని వారు పేర్కొన్నారు.
News November 28, 2025
ఫూలే వర్ధంతి: మంత్రి పొన్నం నివాళి

మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా మినిస్టర్ క్వార్టర్స్లో ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ కోసం ఫూలే చేసిన సేవలను స్మరించుకుంటూ నాయకులు, అధికారులు పుష్పాంజలి ఘటించారు. ఆయన చూపిన మార్గంలో నడిచి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.
News November 28, 2025
చిత్తూరు: సివిల్స్ ఎగ్జామ్కు ఫ్రీ ట్రైనింగ్

యూపీపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానీబాషా అన్నారు. సివిల్స్ ప్రిలిమనరీ, మెయిన్స్ పరీక్షలకు జిల్లాలో అర్హత ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.


