News March 31, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

image

శాంతిభద్రతల దృష్ట్యా జిల్లాలో ఏప్రిల్ 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందని ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 30 పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉన్నందున జిల్లాలో డీఎస్పీ లేదా ఆపై పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు, సభలు నిర్వహించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిషేధంలో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలన్నారు.

Similar News

News April 20, 2025

‘నిన్ను చాలా మిస్ అవుతున్నా’.. మహేశ్ ఎమోషనల్ పోస్ట్

image

తన తల్లి ఇందిరా దేవిని గుర్తుచేసుకుని హీరో మహేశ్‌బాబు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘అమ్మా.. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నా. హ్యాపీ బర్త్‌డే’ అని అమ్మతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు. కాగా 2022లో ఇందిరా దేవి చనిపోయిన సంగతి తెలిసిందే.

News April 20, 2025

తొలి మహిళా కమాండో బృందం ‘టీం శివంగి’ ఏర్పాటు

image

TG: నిర్మల్ జిల్లాలో తొలి మహిళా కమాండో బృందం ‘టీం శివంగి’ ఏర్పాటైంది. ఈ బృందాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘టీం శివంగి’ని ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. మహిళా పోలీసులలోని ఔత్సాహికులకు 45 రోజుల కఠిన శిక్షణ ఇచ్చి కమాండో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఆయుధాలు, సాంకేతిక, తదితర అంశాలపై వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

News April 20, 2025

రేపటి నుంచి వైన్స్ బంద్

image

TG: ఈ నెల 23న హైదరాబాద్‌ స్థానిక సంస్థల MLC ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి వైన్స్ మూతపడనున్నాయి. HYD, సికింద్రాబాద్‌లోని మద్యం దుకాణాలను ఈ నెల 21 సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ జరిగే ఈ నెల 25న వైన్స్ మూసివేయాలన్నారు. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున గౌతమ్ రావు, MIM తరఫున మీర్జా రియాజ్ ఉల్ హసన్ నామినేషన్ దాఖలు చేశారు.

error: Content is protected !!