News February 1, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: SP

image

శాంతిభద్రతల దృష్ట్యా ఆసిఫాబాద్ జిల్లాలో ఫిబ్రవరి 28 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. జిల్లాలో పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు, సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలని కోరారు.

Similar News

News February 12, 2025

సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహించాలి: హుస్సేన్

image

సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ సేవలను గుర్తిస్తూ.. ఫిబ్రవరి 15న ఆయన జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా దేశవ్యాప్తంగా నిర్వహించేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. ఈ విషయమై ఆయన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. సేవాలాల్ జయంతికి సంబంధించి GO విడుదలకు కృషి చేయాల్సిందిగా వినతిలో పేర్కొన్నారు.

News February 12, 2025

ఉప్పలగుప్తం: ఉద్యోగాల ఇప్పిస్తానని టోకరా

image

ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసగించిన కేసులో ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన జంపన గణేశ్ రాజుకి జైలు శిక్ష పడింది. ముద్దాయికి ముమ్మిడివరం జెఎఫ్‌సీఎం కోర్టు మెజిస్ట్రేట్ మహమ్మద్ రహంతుల్లా రెండేళ్లు జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధించినట్లు ఎస్ఐ డి.జ్వాలా సాగర్ తెలిపారు. కొప్పిశెట్టి వీరవెంకట సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 12, 2025

కృష్ణా: టెన్త్ అర్హతతో 67 ఉద్యోగాలు

image

టెన్త్ అర్హతతో కృష్ణా జిల్లా డివిజన్‌లో 67 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3 వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

error: Content is protected !!