News February 28, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో 74.08% పోలింగ్ శాతం నమోదు

image

మెదక్-నిజామాబాద్-కరీంనగర్- అదిలాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని 17 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ పట్టుభద్రులు 6,137 ఓట్లకు గానూ 4,546 పోలవ్వగా 74.8% పోలింగ్ నమోదైందని చెప్పారు. వీరిలో పురుషులు 3,278,మహిళలు 1,268 మంది ఓటు వినియోగించుకున్నారు. 1,591 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. కాగా ఏప్రిల్ 3న కౌంటింగ్ జరుగనుంది.

Similar News

News November 18, 2025

నిర్మల్‌లో కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం

image

నిర్మల్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. ఈ భవనాన్ని రూ.8.10 కోట్లతో, 5.38 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు తెలిపారు. పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, రావుల రాంనాథ్ తదితరులు పాల్గొన్నారు.

News November 18, 2025

పీజీఆర్ఎస్‌లో ప్రతీ దరఖాస్తుకు ప్రాధాన్యత: మన్యం కలెక్టర్

image

పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి దరఖాస్తుకు అధిక ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం పార్వతీపురం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి 73 వినతులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో పారదర్శకత, సమర్థతను పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు.

News November 18, 2025

వరంగల్: చేపల పెంపకంలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

చేపల పెంపకంలో శిక్షణ పొందడానికి ఆసక్తి ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ జిల్లా మత్స్యశాఖ అధికారి తెలిపారు. 18నుంచి 30 ఏళ్ల వయసు గల 7వతరగతి చదివిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 26లోగా 7వ తరగతి, కులం, బదిలీ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో దరఖాస్తులను జిల్లా మత్స్యశాఖ అధికారి, పెద్దమ్మ గడ్డ, ములుగు రోడ్డు, హనుమకొండ, PIN:506007 చిరునామాకు పంపాలన్నారు.