News March 22, 2025

ఆసిఫాబాద్‌: జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్

image

జిల్లా పోలీస్ శాఖ ఈనెల 24 నుంచి జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆసిఫాబాద్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. కౌటాల పోలీస్ స్టేషన్ వేదికగా నిర్వహిస్తున్నామని ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 22 శనివారం వరకు 8466943511 కాల్ చేసి టీం పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఒక గ్రామం నుంచి ఒక్క టీంకి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు.

Similar News

News December 2, 2025

‘రైతన్న.. మీకోసం’లో కర్నూలుకు రాష్ట్రంలో మొదటి స్థానం

image

వారం రోజులు నిర్వహించిన ‘రైతన్న.. మీకోసం’లో రాష్ట్రంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి రైతులకు పంచసూత్రాలు వివరించి, ఫొటోలు పోర్టల్‌లో అప్లోడ్ చేయడం అత్యధిక శాతం నమోదు కావడంతో ఈ విజయాన్ని సాధించామని చెప్పారు. ఈనెల 2, 3వ తేదీల్లో రైతు సేవా కేంద్రాల్లో నిర్వహించే వర్క్‌షాపులను విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

News December 2, 2025

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: APSDMA

image

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. నిన్న మీ ప్రాంతంలో వర్షం పడిందా?

News December 2, 2025

NRPT: రెండో రోజు 202 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు

image

రెండవ విడత నామినేషన్ల ప్రక్రియలో భాగంగా సోమవారం నారాయణపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మొత్తం 202 మంది సర్పంచ్ స్థానాలకు, 404 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దామరగిద్ద మండలంలో 56, ధన్వాడ 43, మరికల్ 41, నారాయణపేట మండలంలో 62 మంది నామినేషన్లు వేశారు. రెండు రోజుల్లో మొత్తం 261 సర్పంచ్ స్థానాలకు, 513 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు అయ్యాయి.