News March 24, 2025

ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో కలకలం

image

ASF జిల్లా కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి. DCCఅధ్యక్షుడు వేరే పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. పార్టీలో చేరిన కోనప్ప ఓ సమయంలో వీడుతారనే ప్రచారం సాగింది. సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రావి శ్రీనివాస్ MLCఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని ఆయనకు షోకాజ్ నోటీసులు పంపింది. కావాలనే ఇలా చేయించారని రావి వర్గీయులు ఆరోపిస్తున్నారు.

Similar News

News February 25, 2026

150 ఫైటర్ జెట్లను మోహరించిన అమెరికా!

image

ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై ఆందోళన నేపథ్యంలో అమెరికా భారీ సైనిక మోహరింపు చేపట్టినట్లు సమాచారం. 20 ఏళ్లలో లేని విధంగా యూరప్, పశ్చిమాసియా స్థావరాలకు 150కి పైగా యుద్ధ విమానాలను తరలించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. వీటిలో ఫైటర్ జెట్లు, రీఫ్యూయలింగ్ విమానాలు ఉన్నాయి. అదనంగా USS గెరాల్డ్ ఆర్.ఫోర్డ్ విమాన వాహక నౌక రంగంలోకి దిగింది. ఇరాన్ ముప్పును అడ్డుకునేందుకే అమెరికా తన బలాన్ని ప్రదర్శిస్తోంది!

News February 25, 2026

మంచిర్యాల: పదో తరగతికి 48 పరీక్షా కేంద్రాలు

image

మంచిర్యాల జిల్లాలో 48 పదో తరగతి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్లో డీఈఓ యాదయ్య, ఇతర విద్యాశాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. 9,703 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

News February 25, 2026

ఈరోజు నమాజ్ వేళలు (25-02-2026, బుధవారం)

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.25 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.37 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 3.51 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.22 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.35 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.