News March 29, 2025

ఆసిఫాబాద్ జిల్లా న్యాయమూర్తిని సన్మానించిన ఎస్పీ

image

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అసిస్టెంట్ సెషన్ జడ్జ్ యువరాజును ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు శాలువాతో సన్మానించినారు. ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసులతో నిర్వహించిన ఓ సదస్సుకు హాజరైన ఆయనను శాలువాతో సన్మానించినట్లు తెలిపారు. వీరితో జిల్లా అదనపు ఎస్పీ ప్రభాకర రావు, ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీలు కరుణాకర్, రామానుజం, రమేష్, సీఐలు, ఎస్ఐ‌లు పాల్గొన్నారు.

Similar News

News October 25, 2025

విద్యుత్ షాక్‌తో యువకుడి దుర్మరణం

image

మోత్కూరు మండల కేంద్రంలో ట్రాన్స్‌ఫార్మర్ రిపేరు చేస్తుండగా బద్దిపడిగ భాస్కర్ రెడ్డి (23) విద్యుత్ షాక్‌కు గురైయ్యాడు. ఆత్మకూరు మండలం పారుపల్లికి చెందిన భాస్కర్ రెడ్డిని తోటి సిబ్బంది భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో పారుపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News October 25, 2025

జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: కొల్లు రవీంద్ర

image

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వంపై బురదజల్లే పనిలో పడ్డారని గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. విజయవాడ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు కృష్ణా జిల్లాను అరాచకాల నిలయంగా మార్చారన్నారు.

News October 25, 2025

మెదక్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గా రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు

image

మెదక్ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గా రాజశేఖర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న మధుసూదన్ గౌడ్ కామారెడ్డికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో టాస్క్‌ఫోర్స్ సీఐగా ఉన్న కృష్ణమూర్తిని డీసీఆర్‌బీకి బదిలీ చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ రెడ్డి.. అదనపు ఎస్పీ మహేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సమర్థవంతంగా విధులు నిర్వహిస్తానని తెలిపారు.