News January 30, 2025

ఆసిఫాబాద్ జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష

image

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం విద్యుత్ శాఖ నోడల్ అధికారి వి.వాసుదేవ్ జిల్లాలోని DEE, ADE, AEలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవికాలానికి సంబంధించి విద్యుత్ కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఇందులో పురోగతిలో ఉన్న, చేపట్టాల్సిన పనులపై సమీక్షించి మార్గనిర్దేశం చేశారు.

Similar News

News December 4, 2025

ఇంటి చిట్కాలు

image

* మినరల్ వాటర్ క్యాన్‌ను శుభ్రం చేసేందుకు బేకింగ్ సోడా, రాళ్ల ఉప్పు, నిమ్మరసం వేసి పావుగంట తర్వాత క్యాన్‌ను క్లీన్ చేస్తే సరిపోతుంది.
* బట్టల మీద ఇంక్ మరకలు పోవాలంటే మరకపై కాస్త నీరు చల్లి, పేస్ట్ తీసుకొని బ్రష్‌తో రుద్ది నీటితో వాష్ చేస్తే మరకలు పోతాయి.
* అగరొత్తుల నుసితో ఇత్తడి సామన్లు శుభ్రం చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.
* లెదర్ వస్తువులను నిమ్మచెక్కతో శుభ్రం చేస్తే మెరుస్తాయి.

News December 4, 2025

ఒక్క వ్యక్తి ఆధారంగా రిజర్వేషన్.. ఎన్నిక బహిష్కరణ

image

TG: STలే లేని పంచాయతీకి ST రిజర్వేషన్ ప్రకటించడంతో నల్గొండ(D) అనుముల(M) పేరూరు గ్రామస్థులు సర్పంచ్ ఎన్నికను బహిష్కరించారు. గతంలో పేరూరు, వీర్లగడ్డ తండా కలిపి ఉమ్మడి పంచాయతీగా ఉండేవి. తరువాత రెండూ విడిపోయాయి. ఆ సమయంలో తప్పుగా నమోదైన ఒకే ఒక్క ఎస్టీ వ్యక్తిని ఆధారంగా తీసుకుని పేరూరు రిజర్వేషన్ కేటాయించారు. ST అభ్యర్థులు లేకపోవడంతో నామినేషన్ దాఖలు చేయలేదు. దీనిపై గ్రామస్థులు HCని ఆశ్రయించారు.

News December 4, 2025

వైసీపీ వల్లే రాజధాని నిర్మాణం ఆలస్యం: నారాయణ

image

AP: వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ విమర్శించారు. బకాయిలు చెల్లించి పనులు ప్రారంభించే నాటికి వర్షాలు ముంచెత్తాయని చెప్పారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయిలో రెండో విడత భూసమీకరణపై గ్రామస్థులతో సమావేశమయ్యారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని పేర్కొన్నారు.