News January 23, 2025

ఆసిఫాబాద్ : దివ్యాంగులకు ఉపాధి పునరావాస పథకం

image

దివ్యాంగులు ఆర్థిక స్వావలంబనతో జీవనం గడిపేందుకు ఉపాధి పునరావాస పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ బుధరవారం ఓ ప్రకటనలో తెలిపారు. బ్యాంకు లింకేజీ లేకుండా రూ.50 వేలు అందిస్తామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 16 యూనిట్లకు రూ.8 లక్షలు రాయితీ మంజూరు చేసినట్లు చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక ఆన్‌లైన్లో జరుగుతుందని తెలిపారు.

Similar News

News February 12, 2025

MBNR: ఇద్దరు ఎస్‌ఐల బదిలీ: డీఐజీ

image

జోగులాంబ గద్వాల జోన్-7 పరిధిలో ఇద్దరు ఎస్‌ఐలను బదిలీ చేసినట్టు డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్ తెలిపారు. రాజాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కేతావత్ రవిని మహబూబ్ నగర్ వీఆర్‌కు బదిలీ చేయగా, జడ్చర్ల PS ఎస్సై శివానందంను రాజాపూర్ పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేశారు. ఈమేరకు డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

News February 12, 2025

పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు అసహనం

image

కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ తన హక్కును కోరడాన్ని చిన్నచూపుగా అభివర్ణించడం బాధాకరమని మంత్రి అన్నారు. దేశానికి భారీగా ఆదాయం అందిస్తున్న తెలంగాణకు తగిన న్యాయం జరగాలని కోరడం న్యాయమేనని అన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గుర్తించి, వాటి అభివృద్ధికి కేంద్రం సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

News February 12, 2025

మెదక్: చెరువులో పడి 6ఏళ్ల చిన్నారి మృతి

image

మెదక్‌లోని తూప్రాన్ పెద్ద చెరువులో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన చాంద్ పాషా, పర్వీన్ కుమార్తె జుబేరియా(6) బుధవారం ఉదయం తల్లితో కలిసి పెద్ద చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి బట్టలు ఉతుకుతుండగా మెట్లపై ఆడుకుంటున్న జుబేరియా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!