News October 26, 2024

ఆసిఫాబాద్: నలుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్

image

ఆసిఫాబాద్ జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో గతంలో SIగా విధులు నిర్వహించిన WSI సోనియా, ASI మను ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ఉమేశ్, రమేశ్ సస్పెండ్ అయ్యారు. సోనియా ఒక కేసు విషయంలో అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై SP శ్రీనివాస్ విచారణ జరిపి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మల్టీ జోన్-1 IG చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News November 15, 2025

నిర్దిష్ట గడువులో పనులు పూర్తి చేయాలి: ADB కలెక్టర్

image

పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలల మౌలిక సదుపాయాలపై కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల మౌలిక సదుపాయాల పనుల్లో ఏ మాత్రం ఆలస్యం సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి పనికి స్పష్టమైన టైమ్‌లైన్‌ ఖరారు చేసి నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.

News November 15, 2025

దర్యాప్తు, పరిశోధన నాణ్యత ప్రమాణాలతో నిర్వహించాలి: ADB ఎస్పీ

image

హత్య, ఆత్మహత్య, రోడ్డు ప్రమాదాలు, అనుమానాస్పద మరణం, నీటిలో మునిగి చనిపోయిన, ఇతర నేరాల దర్యాప్తుకు సంబంధించి పోలీస్ సిబ్బందికి 5 రోజుల పాటు శిక్షణ అందించారు. ఈ శిక్షణలో 21 మంది పాల్గొన్నారు. కోర్టులో నేరస్థులకు శిక్షలు పడినప్పుడు ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. నేర స్థలాన్ని ఏర్పాటు చేసి శిక్షణను అందించారు. ఎఫ్ఐఆర్, కస్టడీ, అరెస్టు, రిమాండ్ అంశాలపై శిక్షణ అందించారు.

News November 15, 2025

ఆధార్ సేవల్లో వేగం, ఖచ్చితత్వం పెంచాలి: కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో ఆధార్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన ఆధార్–మీసేవ ప్రత్యేక సమీకృత శిబిరాల్లో దరఖాస్తు చేసిన విద్యార్థులకు మంజూరైన ఆధార్ కార్డులు, ఆదాయ, నివాసతో పాటు పలు ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ పంపిణీ చేశారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకూడదని అన్నారు.