News March 5, 2025

ఆసిఫాబాద్‌: పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

image

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఈరోజు నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆకస్మికంగా సందర్శించారు. పరీక్ష కేంద్రంలోని తరగతి గదులను తనిఖీ చేసిన ఆయన పరీక్షలు జరుగుతున్న సరళిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలోని 19 పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 అమలులో ఉందని తెలిపారు.

Similar News

News November 16, 2025

ADB: జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి

image

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డిని మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఉన్న నాగోబా ఆలయ అభివృద్ధిపై చర్చించినట్లు వెల్లడించారు.

News November 16, 2025

రాజ్యాంగం వల్లే చాయ్‌వాలా ప్రధాని అయ్యారు: CBN

image

AP: బీఆర్ అంబేడ్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ‘చాయ్‌వాలా మోదీ దేశానికి ప్రధాని కాగలిగారంటే రాజ్యాంగం వల్లే. మన రాజ్యాంగం అందించే స్ఫూర్తి చాలా గొప్పది. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుతూ న్యాయవ్యవస్థ కీలక బాధ్యత పోషిస్తోంది’ అని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైకోర్టు న్యాయవాదులు నిర్వహించిన కార్యక్రమంలో సీఎం, CJI పాల్గొన్నారు.

News November 16, 2025

వరంగల్ సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి: వెంకట్ నారాయణ

image

వరంగల్ మహా నగరాన్ని ఒకే జిల్లాగా ప్రకటించి ప్రాంత సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఉద్యమకారుల ఐక్యవేదిక ఛైర్మన్ వెంకటనారాయణ అన్నారు. ఆదివారం హనుమకొండలో ఆయన మాట్లాడుతూ.. మామునూరు ఎయిర్ పోర్టు, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, ఐటీ హబ్, జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేయాలన్నారు. కార్యక్రమంలో రామమూర్తి, బాబురావు తదితరులు ఉన్నారు.