News March 5, 2025

ఆసిఫాబాద్: పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ 

image

ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే బుధవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని మౌలిక సదుపాయాల కల్పన, ప్రహరీ, భద్రతా అంశాలను పరిశీలించారు. వైద్య శిబిరాన్ని పరిశీలించడంతోపాటు ఎండల దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Similar News

News December 6, 2025

శరీరాకృతికి తగ్గ దుస్తులు వేసుకుంటేనే..

image

కొంతమందికి మంచి పర్సనాలిటీ ఉన్నా ఎంత మంచి దుస్తులు వేసుకున్నా ఆకర్షణీయంగా ఉండరు. అందుకే మన దుస్తుల ఎంపిక మనసుకు నచ్చినట్లు మాత్రమే కాకుండా, శరీరాకృతికి తగ్గట్లుగా దుస్తుల ఎంపిక ఉండాలంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. మన శరీర ప్రత్యేకతను ముందుగా గుర్తించాలి. అలాగే లోపంగా అనిపించే ప్రాంతాన్నీ తెలుసుకోగలగాలి. రెండింటినీ సమన్వయం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఫ్యాషన్ క్వీన్‌లా మెరిసిపోవచ్చంటున్నారు.

News December 6, 2025

అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు

image

గంజాయి అక్రమ రవాణా నిరోధానికి ఎస్పీ తుహీన్ సిన్హా ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు శుక్రవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పర్వత ప్రాంతాలు, రహదారులు, నిరుపయోగంగా ఉన్న భవనాలను డ్రోన్‌లతో పర్యవేక్షించారు. అనుమానితులను ప్రశ్నించి ఫింగర్ ప్రింట్ డివైస్‌తో తనిఖీలు చేశారు. బహిరంగంగా మద్యపానం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.

News December 6, 2025

నిజామాబాద్: 3వ రోజు 2,975 నామినేషన్లు

image

NZB జిల్లాలో 3వ విడత GP ఎన్నికల్లో భాగంగా 3వ రోజైన శుక్రవారం 2,975 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, భీమ్‌గల్, డొంకేశ్వర్, కమ్మర్‌పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాల కోసం 608 మంది, 1,620వార్డు మెంబర్ స్థానాలకు 2,367 మంది నామినేషన్లు వేశారు. 3 రోజుల్లో SPలకు 1,077, WMలకు 4,021 నామినేషన్లు వచ్చాయి.