News March 5, 2025
ఆసిఫాబాద్: పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే బుధవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని మౌలిక సదుపాయాల కల్పన, ప్రహరీ, భద్రతా అంశాలను పరిశీలించారు. వైద్య శిబిరాన్ని పరిశీలించడంతోపాటు ఎండల దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 25, 2025
టికెట్ ధరల పెంపుపై ‘రాబిన్ హుడ్’ టీమ్ ప్రకటన

కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మినహా ఏపీ, తెలంగాణలో టికెట్ ధరల పెంపు లేదని రాబిన్ హుడ్ మూవీ యూనిట్ తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. టికెట్ ధరల పెంపుపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. అభిమానులకు సరసమైన ధరలకే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. సమీప థియేటర్లలో ఈ నెల 28న రాబిన్ హుడ్ సినిమా చూసి ఆనందించాలని కోరింది.
News March 25, 2025
గద్వాల: ఎస్పీ ఆధ్వర్యంలో నేర సమీక్ష సమావేశం

పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను నియంత్రించి, నేరగాళ్లను పట్టుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. మంగళవారం గద్వాల జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలతో ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ కేసుల గురించి సమీక్షించారు. పోలీస్ స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్‌కు గల కారణాలను తెలుసుకున్నారు.
News March 25, 2025
BIG BREAKING: ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రోల్ నంబర్, బర్త్ డే వివరాలను ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: <