News February 2, 2025

ఆసిఫాబాద్: పర్యాటక రంగ అభివృద్ధికి కృషి: రామకృష్ణ

image

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు ప్రాజెక్టు అధికారి రామకృష్ణ తెలిపారు. ఆదివారం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ఆధ్వర్యంలో అడ ప్రాజెక్టు వద్ద నిర్మించిన లేక్ వ్యూ రెస్టారెంట్‌ను జె.డి.ఎం. నాగభూషణం, ఆసిఫాబాద్ వెలుగు మహిళా మండల సమాఖ్య ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

Similar News

News November 5, 2025

సినిమా అప్డేట్స్

image

* తాను నటిస్తోన్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం కోసం హీరో నవీన్ పొలిశెట్టి ఓ పాట పాడారు. దీన్ని ఈ నెల మూడో వారంలో మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం JAN 14న విడుదల కానుంది.
* సుధా కొంగర డైరెక్షన్‌లో శివకార్తికేయన్ నటిస్తోన్న ‘పరాశక్తి’ నుంచి ఫస్ట్ సింగిల్ రేపు రిలీజవనుంది.
* తాను రీఎంట్రీ ఇస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిరాధారమని, ఎలాంటి చిత్రాలనూ నిర్మించడం లేదని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు.

News November 5, 2025

APSRTCలో 277 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

<>APSRTC‌<<>>లో 277 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి నవంబర్ 8 ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ముందు www.apprenticeshipindia.gov.in నమోదు చేసుకోవాలి. అనంతరం వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి జిల్లాను ఎంచుకుని పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.118. వెబ్‌సైట్: https://apsrtc.ap.gov.in/ మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 5, 2025

గొల్లప్రోలు: మైనర్‌పై అత్యాచారం.. నిందితుడికి జైలు శిక్ష

image

గొల్లప్రోలుకు చెందిన మచ్చ రామ్మోహన్‌కు పోక్సో కోర్టు జడ్జి కె. శ్రీదేవి జైలు శిక్ష, జరిమానా విధించారు. 2017లో 17 ఏళ్ల అమ్మాయిని కళాశాల నుంచి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటనపై నమోదు అయిన కేసులో 8 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి ఈ తీర్పు ఇచ్చారని సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. వాదనలు, ప్రతివాదనల అనంతరం న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.