News March 14, 2025
ఆసిఫాబాద్ ప్రజలకు ఎస్పీ సూచనలు

ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా హోలీ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. హోలీ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలని, నదులు, వాగులు, చెరువులకు ఈతరాని వారు వెళ్లవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై జాగ్రత్తలు వహించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News March 26, 2025
కోహ్లీ గొప్ప రోల్ మోడల్: నవజ్యోత్

విరాట్ కోహ్లీ ఒక ఇన్‌స్టిట్యూషన్ లాంటివారని, ఆయన పేరు కొన్ని తరాలు నిలిచి ఉంటుందని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కొనియాడారు. ‘స్టార్ స్పోర్ట్స్’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనొక గొప్ప రోల్ మోడల్ అని, వీధుల్లోని పిల్లలు అతనిలా ఉండాలని కోరుకుంటారని పేర్కొన్నారు. యువతపై అతని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. తన చరిష్మాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
News March 26, 2025
NTR: అన్న క్యాంటీన్లను పరిశీలించిన కమిషనర్

విజయవాడ వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లను మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. విజయవాడ సింగ్‌నగర్ టిక్కల్ రోడ్డు ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఆయన అన్న క్యాంటీన్లో భోజన వసతులను వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్‌లో వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.
News March 26, 2025
అనకాపల్లి: రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

పీఎం ఉపాధి కల్పన పథకం కింద రుణాలు పొందేందుకు అనకాపల్లి జిల్లాలో ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు తదితరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ కార్పొరేషన్ అనకాపల్లి జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షంసున్నీషా బేగం బుధవారం తెలిపారు. తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవారంగానికి రూ.20 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.