News March 3, 2025
ఆసిఫాబాద్: ప్రజా ఫిర్యాదుల విభాగం వాయిదా

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగం వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసనమండలి ఎన్నికల దృశ్య ఓట్ల లెక్కింపు కారణంగా ప్రజా ఫిర్యాదుల విభాగం సోమవారం వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు సహకరించగలరని ఆయన కోరారు.
Similar News
News March 4, 2025
ఆలూర్: గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదంలో గుత్ప వాసి మృతి

ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన చలిగంటి మోహన్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. ఆర్థిక ఇబ్బందుల్లో అప్పులు పెరగడంతో గత ఐదు నెలల క్రితం దుబాయ్ వెళ్లి డెలివరీ బాయ్‌గా పని చేస్తుండగా ఫిబ్రవరి 23న కారు ప్రమాదంలో మరణించాడు. సోమవారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మోహన్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్థులు కోరారు.
News March 4, 2025
MHBD: జిరాక్స్ సెంటర్లు మూసేయండి: కలెక్టర్

మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలు దగ్గర్లో ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయించాలని అధికారులను ఆదేశించారు.
News March 4, 2025
వెలుగోడు మండలం నుంచి ఎస్ఐలుగా యువతీ, యువకుడు

వెలుగోడు మండలం మాధవరానికి చెందిన మద్దెల సంజీవ కుమార్ కొడుకు సతీశ్, గుంతకందాలకు చెందిన వెంకటేశ్వర్లు కుమార్తె నాగ కీర్తన ఎస్ఐలుగా ఎంపికయ్యారు. అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న సతీశ్‌కు శ్రీ సత్యసాయి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. నాగ కీర్తనకు కడపలో పోస్టింగ్ ఇచ్చారు. వీరిరువురినీ వారి కుటుంబ సభ్యులు అభినందించారు.