News September 15, 2024
ఆసిఫాబాద్: భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య
భర్త మందలించినందుకు భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసిఫాబాద్ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది.. CI సతీష్ కుమార్ వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ మండలం అడ గ్రామానికి చెందిన గంగుబాయితో అదే గ్రామానికి చెందిన హుడే లక్ష్మణ్ తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య బట్టలు ఉతకడానికి బయటకు వెళ్లి ఇంటికి లేటుగా వచ్చినందుకు భర్త మందలించడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Similar News
News October 7, 2024
నిర్మల్: రూ.7,33,999తో అమ్మవారి అలంకరణ
నిర్మల్ పట్టణంలోని ధ్యాగవాడ హనుమాన్ ఆలయంలో కొలువు దీరిన దుర్గా మాత మండపం వద్ద ఆదివారం రాత్రి అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించారు. రూ.500, రూ.200, రూ.100 ఇతర నోట్లతో మొత్తం రూ .7,66,999తో అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు..
News October 7, 2024
మంచిర్యాల: ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
పెళ్లి చేసుకుంటానని ప్రియుడు మోసం చేయడంతో ప్రియురాలు అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. బాధితురాలి వివరాల ప్రకారం.. మంచిర్యాల నెన్నెల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి, గొల్లపల్లి గ్రామానికి చెందిన రేచవేని రాజశేఖర్ 2ఏళ్లుగా ప్రేమించుకున్నారు. తనను శారీరకంగా లోబరుచుకొని, పెళ్లి మాట ఎత్తే సరికి ముఖం చాటేశాడని యువతి తెలిపింది. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని పేర్కొంది.
News October 7, 2024
బోథ్: ‘సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు’
బోథ్ PHCలో గత మార్చి నెలలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్న ఆదివాసి మహిళ డిశ్చార్జ్ అయ్యారు. మార్చి 31న మహిళ అనారోగ్యంతో మరణించిందని సివిల్ అసిస్టెంట్ సర్జన్ ద్వారా పోస్టుమార్టం నివేదికలో తేలిందని జిల్లా DSP జీవన్ రెడ్డి పేర్కొన్నారు. సాధారణ మరణంపై ప్రస్తుతం కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.