News December 30, 2024

ఆసిఫాబాద్: మంత్రి సీతక్కను కలిసిన డీసీసీ అధ్యక్షుడు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్కను ఆదివారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడ్డ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధి కేటాయించాలన్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. 

Similar News

News January 6, 2025

స్త్రీలను కోటీశ్వరులను చేసేందుకు కృషి: MNCL కలెక్టర్

image

ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మహిళలను రాష్ట్ర ప్రభుత్వం కోటీశ్వరులను చేసేందుకు కృషి చేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌కుమార్ దీపక్ అన్నారు. ముల్కల్ల పంచాయతీ వీరాంజనేయులు SHG సభ్యురాలు విజయకు సంచార చేపలు విక్రయించేందుకు వాహనాన్ని సోమవారం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాధ్యతతో వ్యాపారాన్ని నిర్వర్తించి కుటుంబానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.

News January 6, 2025

కాంగ్రెస్‌కు ఆదిలాబాద్ సెంటిమెంట్

image

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమీక్ష సోమవారం నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాను సెంటిమెంట్‌గా భావిస్తున్న కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా టీపీసీసీ ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్ధేశం చేయనున్నారు.

News January 6, 2025

ADB: మాంజాతో గొంతులు తెగుతున్నాయ్.. జాగ్రత్త.!

image

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండటంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. కాగా, చైనా మాంజాలు వాడినా, విక్రయించినా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.