News November 30, 2024

ఆసిఫాబాద్: మహిళపై దాడి.. 14 మందికి జైలు శిక్ష

image

ఒంటరి మహిళపై మారణాయుధాలతో దాడి చేసిన కేసులో 14మందికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి యువరాజు తీర్పు వెల్లడించినట్లు జిల్లా SP శ్రీనివాసరావు తెలిపారు. 2021లో కౌటాల మండలం ముత్యంపేటకు చెందిన నాగమణిపై ఖాళీ స్థలం విషయంలో మారణాయుధాలతో దాడి చేసిన 14మంది నిందితులను కోర్టులో హాజరుపర్చగా విచారణ అనంతరం జడ్జీ వారికి శిక్ష విధించారు.

Similar News

News January 6, 2026

ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు నియమాలు పాటించాలి: డీఎస్పీ

image

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో గూడ్స్ సరుకులు రవాణా చేయవద్దని, ప్రతి బస్సులో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపకుండా ఓనర్లు బాధ్యత వహించాలని, రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనుమానాస్పద ప్రయాణికులు, నిషేధిత పదార్థాలపై అప్రమత్తంగా ఉండి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

News January 6, 2026

నాగోబా జాతరకు పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ అఖిల్ మహాజన్

image

కేస్లాపూర్‌లో ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న నాగోబా జాతర ఏర్పాట్లను ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాతరకు భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు భద్రతా చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జాతరలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల పార్కింగ్, రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశామన్నారు. అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఇతర సిబ్బంది ఆయనతోపాటు ఉన్నారు.

News January 6, 2026

‘ఆరోగ్య పాఠశాల’ అమలుపై కలెక్టర్ సమీక్ష

image

విద్యార్థుల శారీరక, మానసిక వికాసమే ప్రధాన లక్ష్యంగా జిల్లాలో ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఆరోగ్య పాఠశాలపై సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్యం, పరిశుభ్రత, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడమే ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.