News November 30, 2024
ఆసిఫాబాద్: మహిళపై దాడి.. 14 మందికి జైలు శిక్ష
ఒంటరి మహిళపై మారణాయుధాలతో దాడి చేసిన కేసులో 14మందికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి యువరాజు తీర్పు వెల్లడించినట్లు జిల్లా SP శ్రీనివాసరావు తెలిపారు. 2021లో కౌటాల మండలం ముత్యంపేటకు చెందిన నాగమణిపై ఖాళీ స్థలం విషయంలో మారణాయుధాలతో దాడి చేసిన 14మంది నిందితులను కోర్టులో హాజరుపర్చగా విచారణ అనంతరం జడ్జీ వారికి శిక్ష విధించారు.
Similar News
News December 11, 2024
మంచిర్యాల: కుటుంబంలో ముగ్గురు మృతి
కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో చికిత్స పొందుతున్న ముగ్గురు బుధవారం ఉదయం మృతి చెందారు. తాండూరు మండలం కాసిపేటకు చెందిన మొండయ్య కుటుంబీకులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొండయ్య, అతడి కుమార్తె చైతన్య(30) ఇవాళ ఉదయం మృతి చెందగా.. కొద్దిసేపటి క్రితమే అతడి భార్య శ్రీదేవి కూడా మృతి చెందింది. కుమారుడు శివప్రసాద్(26) పరిస్థితి విషమంగా ఉంది.
News December 11, 2024
మంచిర్యాల: చికిత్స పొందుతున్న తండ్రి, కుమార్తె మృతి
మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంగళవారం పురుగు మందు తాగి <<14839477>>ఆత్మహత్యాయత్నం<<>> చేసుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొండయ్య(60), అతడి కుమార్తె చైతన్య(30) మృతి చెందారు. భార్య శ్రీదేవి(50), కుమారుడు శివ ప్రసాద్(26) పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
News December 11, 2024
MNCL: పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో అభ్యంతరాలు తెలపాలి: కలెక్టర్
పంచాయతీ ఎన్నికలలో భాగంగా జిల్లాలో గుర్తించిన పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో ఏమైనా అభ్యంతరాలు ఉంటేలిఖితపూర్వకంగా తెలపాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని 311 గ్రామ పంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు 2, 2,730 కేంద్రాలను గుర్తించినట్లు పేర్కొన్నారు.