News January 29, 2025

ఆసిఫాబాద్ మెడికల్ షాపుల్లో బినామీ వ్యక్తుల హవా?

image

ఆసిఫాబాద్ జిల్లాలో మందుల షాపులను బినామీ వ్యక్తులే నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్ ఫార్మసిస్టు ఆధ్వర్యంలో అవగాహన ఉన్న సిబ్బందితో మాత్రమే దుకాణాలను నిర్వహించాలి. చాలా మంది తక్కువ వేతనంతో యువకులకు పనిలో పెట్టుకుంటున్నారు. మెడికల్‌పై పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు నిర్వహించాలని వారు కోరుతున్నారు.

Similar News

News October 18, 2025

బ్రిటన్‌లో ‘ఆధార్’ తరహా వ్యవస్థ?

image

ఆధార్ కార్డు తరహా వ్యవస్థను UKలో తీసుకురావాలని ఆ దేశ PM స్టార్మర్ భావిస్తున్నారు. తమ డిజిటల్ ఐడెంటిటీ ప్రోగ్రామ్‌ ‘బ్రిట్ కార్డ్’కు ఆధార్‌ను ప్రేరణగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్‌లో మాదిరి సంక్షేమం, సర్వీసుల కోసం కాకుండా ఇల్లీగల్ మైగ్రెంట్ వర్కర్ల కట్టడికి ఈ వ్యవస్థను వాడుకోనున్నట్లు సమాచారం. తన ముంబై పర్యటన సందర్భంగా ఆధార్‌ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన వారితో స్టార్మర్ భేటీ అయ్యారు.

News October 18, 2025

ములుగు: మేము లొంగిపోతాం: ‘మావో’ లేఖ

image

అగ్రనాయకుల లొంగుబాట్లతో అడవులు ఖాళీ అవుతున్నాయి. మొన్న మల్లోజుల వేణుగోపాల్ టీం, నిన్న తక్కళ్లపల్లి వాసుదేవరావు@ ఆశన్న టీం లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా ఉదంతి ఏరియా కమిటీ కార్యదర్శి సునీల్ ఓ ప్రకటన విడుదల చేశారు. తాము సైతం లొంగిపోనున్నట్లు లేఖలో వెల్లడించారు. నేటి పరిస్థితుల్లో ఆయుధాలతో యుద్ధం చేయలేమని, సీసీ కమిటీ నిర్ణయం తీసుకోవడంలో విఫలమైందన్నారు.

News October 18, 2025

ములుగు: రూ.500కు ప్లాట్.. ట్రెండింగ్‌లో లక్కీ డ్రా స్కీమ్స్..!

image

ఇండ్లు, ఇంటి స్థలాల అమ్మకంలో ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆకర్షనీయమైన లక్కీ డ్రా పేరుతో సరికొత్త విధానం పాటిస్తున్నారు. రూ.500 నుంచి రూ.600కే ప్లాటు గెలుచుకోండి.. అంటూ టోకెన్లు అమ్ముతున్నారు. ఇప్పుడు ములుగు జిల్లాలో ఈ తరహా లక్కీ డ్రా విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది యజమానులు తమ ఇంటి స్థలాలను డ్రా పద్ధతిలో అమ్ముకునేందుకు ముందుకు వస్తుండటం విశేషం.