News January 29, 2025
ఆసిఫాబాద్ మెడికల్ షాపుల్లో బినామీ వ్యక్తుల హవా?

ఆసిఫాబాద్ జిల్లాలో మందుల షాపులను బినామీ వ్యక్తులే నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్ ఫార్మసిస్టు ఆధ్వర్యంలో అవగాహన ఉన్న సిబ్బందితో మాత్రమే దుకాణాలను నిర్వహించాలి. చాలా మంది తక్కువ వేతనంతో యువకులకు పనిలో పెట్టుకుంటున్నారు. మెడికల్‌పై పరిజ్ఞానం లేని వ్యక్తులు షాపులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు నిర్వహించాలని వారు కోరుతున్నారు.
Similar News
News February 8, 2025
‘వందే భారత్’లో ఫుడ్.. రైల్వే కీలక నిర్ణయం

వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు రైల్వే శాఖ మరో సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. టికెట్ బుకింగ్ సమయంలో ఫుడ్ ఆప్షన్ ఎంచుకోని వారికి కూడా అప్పటికప్పుడు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. అయితే రాత్రి 9 గంటలలోపు మాత్రమే ఫుడ్ బుక్ చేసుకోవాలి. ప్రయాణాల్లో ఆహారం దొరకడం లేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు IRCTC పేర్కొంది. క్వాలిటీ ఫుడ్ అందించాలని సంబంధింత విభాగాలను ఆదేశించింది.
News February 8, 2025
ఉట్నూర్: సీఎంను కలిసిన కొమరం భీమ్ మనవడు

ఉట్నూర్: రాష్ట్ర పండుగగా కొమరం భీమ్ వర్ధంతిని జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని హర్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని కొమరం భీమ్ మనవడు సోనేరావు శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలసి సన్మానించారు. రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జోడేఘాట్ ప్రాంతంలోని 12 గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.
News February 8, 2025
GREAT.. WGL: ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన అల్లూరి రంజిత్ రెడ్డి ఎంబీఏ పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. జఫర్‌గడ్ మండలంలో వీరు “మా ఇల్లు ఆశ్రమంలో” అనాథగా పెరిగిన విజేతను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. అనంతరం ఆశ్రమంలోనే అనాథల మధ్య పెళ్లి వేడుక ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.