News September 29, 2024
ఆసిఫాబాద్: ‘రాజీ మార్గమే రాజా మార్గం’
రాజీ మార్గమే రాజా మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవి.రమేష్ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ పట్టణంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలతో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా కేసులను అక్కడికక్కడే పరిష్కరించినట్లు ఆయన తెలిపారు.
Similar News
News October 7, 2024
ఆదిలాబాద్: ఆరో విడత ద్వారా ITIలో అడ్మిషన్లు
ఆరో విడత ద్వారా ఐటీఐ కళాశాలలో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ITI కళాశాల ప్రిన్సిపాల్ రొడ్డ శ్రీనివాస్ పేర్కొన్నారు. అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 9 వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నమోదు చేసుకున్న అభ్యర్థులు, తిరిగి నమోదు చేయనవసరం లేదని పేర్కొన్నారు. ఇంకా నమోదు చేయని అభ్యర్థులు ఐటీఐ పోర్టల్‌లో కొత్తగా నమోదు చేసుకుని, కళాశాలకు హాజరు కావాలని సూచించారు.
News October 6, 2024
ఖానాపూర్: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఖానాపూర్ పట్టణంలోని సుభాష్‌నగర్ కాలనీలో గల వాగ్దేవి కళాశాల సమీపంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్సై రాహుల్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40 నుంచి 50 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
News October 6, 2024
దిలావర్పూర్: కొత్త చెరువులో గుర్తుతెలియని శవం
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలోని కొత్తచెరువులో ఆదివారం గుర్తుతెలియని శవం లభ్యమయింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. అటువైపు వెళ్లిన కొందరు నీటిపై తేలుతున్న శవాన్ని చూసి గ్రామస్థులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.