News February 21, 2025
ఆసిఫాబాద్: 22న జిల్లాలో విద్యాసంస్థలకు స్థానిక సెలవు

బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్బంగా ఈనెల 22న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అన్ని విద్య సంస్థలకు స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 22న జిల్లా కేంద్రంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా ప్రకటించిన స్థానిక సెలవుకు బదులుగా ఏప్రిల్ 12న పని దినంగా పాటించాలని సూచించారు.
Similar News
News November 23, 2025
జనగామ: నేడే ఎన్ఎంఎంఎస్ పరీక్ష..!

కేంద్ర ప్రభుత్వం 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు అందించే రూ.12 వేల ఉపకార వేతనానికి సంబంధించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఆదివారం జరగనుంది. ఇందుకు జనగామ జిల్లాలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 729 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పర్యవేక్షణకు నలుగురు చీఫ్ సూపరింటెండెంట్ లు, నలుగురు డిపార్ట్మెంట్ ఆఫీసర్లను, 40 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.
News November 23, 2025
అచ్చంపేట: యువకుడిపై పోక్సో కేసు నమోదు

అచ్చంపేట మున్సిపాలిటీ పరిధికి చెందిన బాలికపై అదే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువకుడు అఘాయిత్యం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్ కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
News November 23, 2025
చిలకపాలెం-రాయగడ రోడ్డు పనులకు రేపు శంకుస్థాపన

చిలకపాలెం-రామభద్రపురం-రాయగడ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బేబినాయన, బుడా చైర్మన్ తెంటు రాజా సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీలో బేబినాయన కోరడంతో రూ.4.50కోట్లు మంజూరయ్యాయి. గొర్లెసీతారాంపురం వద్ద శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


