News December 21, 2024

ఆసిఫాబాద్: 44 కేసులలో 59 మంది అరెస్ట్

image

అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా SPశ్రీనివాసరావు హెచ్చరించారు. SP మాట్లాడుతూ.. జిల్లాలో జూన్ నుంచి ఇప్పటివరకు అక్రమంగా గుట్కాలు అమ్ముతున్న వారిలో 44 కేసులలో 59మందిని అరెస్ట్ చేసి, రూ.38,38152/-విలువగల గుట్కా రికవరీ చేశామన్నారు. PDS బియ్యం, ఇసుక, గుట్కా, గంజాయి లాంటి వాటితో అక్రమ వ్యాపారాలు చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

Similar News

News January 21, 2025

కడెం: కొడుకును చూడటానికి వెళ్తుండగా ACCIDENT

image

కడెం మండలం పాండ్వాపూర్ గ్రామానికి చెందిన మల్లపల్లి భూమన్న ఈనెల 19న ఉట్నూరు మండలం సాలెవాడకు తన పని ముగించుకొని కుమారుడిని చూడడానికి వెళ్తూ బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. గమనించిన స్థానికులు నిర్మల్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి పేర్కొన్నారు.

News January 21, 2025

నూతన వధువులను నాగోబాకు పరిచయం చేస్తారు

image

మెస్రం వంశస్థుల్లో నూతన వధువులను నాగోబా దేవునికి పరిచయం చేయడం ఆనవాయితీగా వస్తుంది. జాతరలో భాగంగా కుల పెద్దలు నూతన వధువులను నాగోబా దేవుని దగ్గరకు తీసుకువెళ్లి వారితో పూజ చేయించి నాగోబాకు పరిచయం చేస్తారు. దీన్నే ‘భేటింగ్ కియావాల్’ అంటారు. అక్కడి నుంచి శ్యాంపూర్‌లోని బోడుందేవ్ జాతర పూర్తయ్యాక ఎవరి గృహాలకు వారు వెళ్ళిపోతారు.

News January 21, 2025

డ్రైవర్ నిర్లక్ష్యంతోనే నార్నూర్ రోడ్డు ప్రమాదం: ASP

image

నార్నూర్ మండలంలో ఐచర్ బోల్తా ఘటన ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందని ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవర్ కనక శ్రీరామ్ ఐచర్ వాహనం నడిపినట్లు పేర్కొన్నారు. డ్రైవర్‌పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 2 మృతి చెందగా.. 35 మందికి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.