News March 28, 2025
ఆసిఫాబాద్: BSNL టవర్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: కలెక్టర్

BSNL నెట్వర్క్ టవర్ల నిర్మాణాల కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్, బిఎస్ఎన్ఎల్ నిజామాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లతో కలిసి నెట్వర్క్ టవర్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన 9 టవర్లలో 8 టవర్ల నిర్మాణాలకు ఎలాంటి ఆటంకాలు లేనందున ప్రారంభించాలన్నారు.
Similar News
News December 9, 2025
విద్యార్థుల గళంపై కూటమి ఉక్కుపాదం మోపుతుంది: YCP

విద్యార్థుల గళంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని YCP ‘X’లో పోస్ట్ చేసింది. YCP స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని నిరసన తెలిపినందుకు చైతన్యపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారని రాసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగితే కేసులా చంద్రబాబు, లోకేశ్ అంటూ ప్రశ్నించారు.
News December 9, 2025
జగిత్యాలలో రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. ఈరోజు కనిష్ఠంగా కథలాపూర్, మన్నెగూడెంలో 9.1℃, రాఘవపేట 9.3, ఐలాపూర్ 9.4, గుల్లకోట 9.5, మల్లాపూర్ 9.5, మేడిపల్లి, పేగడపల్లి, నేరెళ్ల 9.6, గోవిందారం 9.7, రాయికల్, జగ్గాసాగర్ 9.8, పూడూర్, బుద్దేశ్పల్లి 9.9, అల్లీపూర్లో 10.0℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలన్నింటికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగతా ప్రాంతాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంది.
News December 9, 2025
ప్రియురాలి వీడియో వైరల్.. హార్దిక్ పాండ్య ఆగ్రహం

బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లపై టీమ్ ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రెస్టారెంట్ మెట్లు దిగి వస్తుండగా తన ప్రియురాలు మహికా శర్మను అసభ్యంగా ఫొటోలు, వీడియోలు తీయగా అవి వైరలయ్యాయి. దీంతో చీప్ సెన్సేషనలిజమ్ కోసం ఇలా దిగజారడం సరికాదని ఇన్స్టాలో పాండ్య ఫైరయ్యారు. మహిళలను గౌరవించాలని హితవు పలికారు. ఇకపై ఫొటోలు తీసేటప్పుడు మైండ్ఫుల్గా ప్రవర్తించాలన్నారు.


