News March 6, 2025
ఆసిఫాబాద్: KU పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని రెగ్యులర్ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను విడుదల చేసినట్లు KU అధికారులు పేర్కొన్నారు. 2, 4, 6 డిగ్రీ సెమిస్టర్కు సంబంధించిన పరీక్ష ఫీజు ఈనెల 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఏప్రిల్ 2 వరకు వరకూ అవకాశముందన్నారు. పరీక్షలు ఏప్రిల్ నెలలో ఉంటాయని పేర్కొన్నారు.
Similar News
News March 6, 2025
భాగస్వామితో కలిసి నిద్రిస్తే కలిగే ప్రయోజనాలివే..!

భార్యాభర్తలు కలిసి <<15666785>>నిద్రించడం<<>> వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మిస్సవ్వడం, ప్రెజర్స్, టార్గెట్స్, వేధించే ఒంటరితనానికి ఇదే అసలైన ఔషధం అంటున్నారు. లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్ విడుదలై డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ తగ్గుతాయని, ఆయు: ప్రమాణం, బంధంపై సంతృప్తి పెరుగుతాయని చెప్తున్నారు. భాగస్వామి నుంచి ప్రేమ, కంఫర్ట్, రిలాక్స్, హ్యాపీ, ప్రశాంతతను ఫీలవుతారన్నారు.
News March 6, 2025
MTM: యూజీ ఫస్ట్ సెమ్ పరీక్షా ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్శిటీ అనుబంధ కళాశాలలకు సంబంధించి UG మొదటి సెమిస్టర్ ఫలితాలను, UG వన్ టైమ్ పరీక్షా ఫలితాలను గురువారం విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. రాంజీ విడుదల చేశారు. 7,212 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 4,302 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఉత్తీర్ణతా శాతం 59.65%గా నమోదైందన్నారు. ఫస్ట్ సెమిస్టర్ పునఃమూల్యాంకనం కొరకు ఈ నెల 19వ తేదీ లోపు నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 6, 2025
భర్త చేతిలో గాయపడిన భార్య మృతి

కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామంలో భర్త చిన్న వెంకటరామిరెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య విద్య మనోహరమ్మ బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్యపై అనుమానం పెంచుకొని, తాగిన మైకంలో వెంకట్రామిరెడ్డి రోకలి బండతో భార్యపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న మనోహరమ్మను బనగానపల్లెకు తరలించగా మృతి చెందినట్లు సీఐ రమేశ్ బాబు తెలిపారు.