News November 16, 2024
ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించాలి: సూపరింటెండెంట్
ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వ వైద్యశాల ధన్వంతరి కాన్ఫరెన్స్ హాల్లో మినిస్ట్రీయల్ స్టాఫ్తో సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే, వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు.
Similar News
News December 27, 2024
టీజీ భరత్ కుమార్తె పెళ్లిలో చిరంజీవి, బాలకృష్ణ
మంత్రి టీజీ భరత్ కుమార్తె ఆర్యపాన్య వివాహ వేడుక హైదరాబాదులోని GMR అరేనలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి, హీరో బాలకృష్ణ హాజరై సందడి చేశారు. నూతన వధూవరులు ఆర్యాపాన్య, వెంకట నలిన్ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జిల్లా మంత్రి ఫరూక్, పలువురు ఎమ్మెల్యేలు బాలయ్యతో ముచ్చటించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
News December 26, 2024
మంత్రి భరత్ కుమార్తె పెళ్లిలో సీఎం చంద్రబాబు
మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. హైదరాబాదులోని GMR అరేనలో జరిగిన ఈ వేడుకకు హాజరై వధూవరులు ఆర్యాపాన్య, వెంకట నలిన్ను ఆశీర్వదించారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
News December 26, 2024
శ్రీశైలానికి మంత్రి కొండా సురేఖ రాక
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రానికి నేడు తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ రానున్నట్లు దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. రాత్రి 7 గంటలకు మంత్రి శ్రీశైలం చేరుకుంటారని చెప్పారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.