News June 28, 2024

ఆస్ట్రేలియా హైకమిషనర్‌ను కలిసిన వేమిరెడ్డి

image

ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్‌ను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో లోక్‌సభ ఎంపీలతో ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్‌కు వేమిరెడ్డి పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. పలు అంశాలపై చర్చించారు.

Similar News

News December 12, 2024

అనంతసాగరం: తండ్రి, కుమారుల గొడవ.. కొడుకు మృతి

image

అనంతసాగరం మండలం ఇనగలూరులో తండ్రి-కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కొడుకు మృతి చెందాడు. కొడుకు మస్తాన్ రోజు మద్యం సేవించి ఇంటికి వస్తుండేవాడు. దీనితో తండ్రి నబ్బీసాహెబ్ మందలించాడు. ఈ క్రమంలో తండ్రి పై కర్రతో దాడి చేయబోయి పక్కనే ఉన్న రాళ్ల పై పడి కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మస్తాన్ మృతి చెందాడు.

News December 12, 2024

నెల్లూరు: సౌదీలో నర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు 

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులకు సౌదీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు నెల్లూరు జిల్లా ఉపాధి అధికారి వినయ్ కుమార్ పేర్కొన్నారు. అభ్యర్థులు 18-40 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండి, ఏదైనా ఆస్పత్రిలో 18 నెలలు పని చేసిన అనుభవం ఉండాలన్నారు. ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి రూ.78- రూ.89 వేలు వేతనం లభిస్తుందన్నారు.

News December 12, 2024

నెల్లూరు: ‘ప్రైవేటు భాగస్వామ్య వివరాలను తెలపండి’

image

భారత అంతరిక్ష రంగంలో గత ఐదేళ్లలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలియజేయాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. బుధవారం ఈ మేరకు లోక్‌సభలో ఆయన పలు అంశాలపై వివరాలను ఆయన ఆరా తీశారు. ఇస్రోతో భాగస్వామ్యం కలిగి ఉన్న ప్రైవేటు కంపెనీల జాబితాను తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.