News March 26, 2025
ఆస్తి కోసం తండ్రిని చంపిన కుమారుడు

ఆస్తి తగాదాలో తండ్రిని గొడ్డలితో నరికి చంపిన ఘటన రాయదుర్గం మండలం టి.వీరాపురంలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. 2 ఎకరాల భూమిని తనకు రాసివ్వాలని తండ్రి సుంకప్పతో కొడుకు వన్నూరుస్వామి తరచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం కోపోద్రిక్తుడై మంచంపై నిద్రపోతున్న తండ్రిని గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. ఘటనా స్థలాన్ని రాయదుర్గం అర్బన్ సీఐ జయనాయక్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 7, 2025
ఇంగ్లండ్ చెత్త రికార్డు

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఓటముల పరంపర కొనసాగిస్తోంది. రెండో టెస్టులోనూ <<18496629>>పరాజయంపాలైన<<>> ఆ టీమ్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. D/N టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 300+ స్కోర్ చేసి ఓడిపోయిన మొదటి జట్టుగా నిలిచింది. అలాగే ఒకే విదేశీ గడ్డపై విజయం లేకుండా అత్యధిక మ్యాచులు(16) ఆడిన క్రికెటర్‌గా జో రూట్ ఖాతాలో అన్‌వాంటెడ్ రికార్డు చేరింది. అతను ఆడిన మ్యాచుల్లో 14 ఓడిపోగా, 2 డ్రా అయ్యాయి.
News December 7, 2025
ఆదిలాబాద్: 50 నుంచి 100 మందికి ఓ బాధ్యుడు..!

పంచాయతీ పోలింగ్ తేదీలు దగ్గర పడుతున్న కొద్ది సర్పంచి అభ్యర్థులు ప్రచార జోరు పెంచుతున్నారు. ప్రతి ఓటు కీలకం కావడంతో ఓటర్లు ప్రత్యర్థివైపు వెళ్లకుండా వ్యూహాలు పన్నుతున్నారు. కొన్ని పంచాయతీల్లో 50 నుంచి 100 మంది ఓటర్లకు ఓ బాధ్యున్ని నియమిస్తూ బాధ్యతలు అప్పగిస్తున్నారు. కీలకమైన కుల సంఘాల ఓట్లు దక్కించుకునేందుకు ఆ సంఘంలో చురుకుగా ఉండే వారికి బాధ్యతలు ఇస్తూ ఓట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
News December 7, 2025
మరిపెడ: ఈత చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన గౌడ సంఘం అధ్యక్షుడు పోగుల సత్యం(60) ఆదివారం ఈత చెట్టు పై నుంచి జారిపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యం రోజు మాదిరిగానే కల్లు గీత కోసం చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


