News March 11, 2025
ఆస్తి కోసమే.. తల్లిని హత్య చేశాడు!

నంద్యాల(D) ఉయ్యాలవాడలో నిన్న కసాయి కొడుకు తల్లిని హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. పుల్లమ్మ (75) కొడుకు గురవయ్య మద్యానికి బానిసయ్యాడు. అతడి వేధింపులు భరించలేక తల్లి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల పుల్లమ్మ ఆస్తిని తన మనవడి పేరుపై రాసింది. దీంతో తన పేరుపై రాయించాలని తల్లితో గొడవపడేవారు. సోమవారం ఉదయం డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశాడు. ఆమె ఇవ్వకపోవడంతో తలపై కర్రతో కొట్టి హత్య చేశాడు.
Similar News
News November 28, 2025
గొర్రెల్లో బొబ్బ రోగం.. ఎలాంటి చికిత్స అందించాలి?

☛ వ్యాధి సోకిన గొర్రెలను వెంటనే మంద నుంచి వేరు చేయాలి.
☛ ఆ గొర్రెలకు గంజి వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. పచ్చి పశుగ్రాసాన్ని ఎక్కువగా ఇవ్వరాదు.
☛ బొబ్బల మీద వేపనూనె లేదా హిమాక్స్ వంటి పూత మందులను రాయాలి.
☛ వెటర్నరీ డాక్టర్ సలహాతో బాక్టీరియాను నియంత్రించడానికి యాంటీ బయాటిక్స్, డీహైడ్రేషన్ తగ్గించడానికి IV fluids లేదా ORS తరహా ద్రావణాలు ఇవ్వడం, టీకాలు అందించడం మంచిది.
News November 28, 2025
మహాత్మా జ్యోతిరావ్ ఫూలేకు నివాళులర్పించిన విశాఖ కలెక్టర్

మహాత్మా జ్యోతిరావ్ ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం నౌరోజీ రోడ్డులోని ఆయన విగ్రహానికి కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఫూలే చేపట్టిన సామాజిక సంస్కరణలు, సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. ఫూలే అణగారిన కులాల అభ్యున్నతికి, స్త్రీ జనోద్ధరణకు విశేష సేవలు చేశారన్నారు.
News November 28, 2025
NGKL: ఎన్నికల అభ్యర్థులకు కొత్త బ్యాంకు ఖాతా తప్పనిసరి

గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరవాలని అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడత ఎన్నికలలో గడువు తక్కువగా ఉండటంతో పాత ఖాతాలను అనుమతించారు. అయితే, రెండో విడత ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా కొత్త ఖాతాలు తెరవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.


