News April 2, 2025
ఆస్తి పన్ను వసూళ్లు.. నాలుగో స్థానంలో మంచిర్యాల

2024-25 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లలో జిల్లాలోని 5 మున్సిపాలిటీలు, ఒక కార్పోరేషన్లో లక్షట్టిపేట మున్సిపాలిటీ 70.22 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. బెల్లంపల్లి మున్సిపాలిటీ 56.25శాతంతో చివరి స్థానంలో నిలిచింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 64.73 శాతంతో 4వ స్థానంలో నిలిచింది. మందమర్రి 76.86%, క్యాతనపల్లి 76.14%, చెన్నూరు 61.05 శాతం పన్ను వసూళ్లు చేపట్టాయి.
Similar News
News November 15, 2025
నాగర్ కర్నూల్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో అత్యల్పంగా 12.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దండలో 12.2, ఊర్కొండలో 12.3, కొండనాగులలో 12.4, కల్వకుర్తిలో 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో చలి కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
News November 15, 2025
సైదాపూర్: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని రెడ్డి అర్చన అనుమానాస్పదంగా మృతి చెందింది. శుక్రవారం కళాశాలకు వెళ్లి పరీక్ష రాసి ఇంటికి వచ్చిన అర్చన, శనివారం తెల్లవారుజామున మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 15, 2025
ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. MBNRలో ఇదీ పరిస్థితి..!

MBNR జిల్లాలో ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. అత్యల్పంగా బాలానగర్ మండల కేంద్రంలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్లో 11.1, గండీడ్ మండలం సల్కర్పేటలో 11.3, మిడ్జిల్లో 12.3, కోయిలకొండ సిరివెంకటాపుర్, భూత్పూర్లో 12.7, మహ్మదాబాద్లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.


