News July 3, 2024

ఆస్తుల విక్రయానికి వ్యతిరేకంగా పోరాటం: సీపీఐ

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల విక్రయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ స్పష్టం చేశారు. బుధవారం విశాఖలో సీపీఐ నేతలతో సమావేశం అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. గత ప్రభుత్వం అక్రమాలపై విచారణ జరిపి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఆయనతో పాటు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.

Similar News

News January 2, 2026

న్యూఇయర్ రోజు విశాఖలో యువకుడి ఆత్మహత్య

image

న్యూఇయర్ వేళ విశాఖలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ నగర్‌కి చెందిన షణ్ముఖరావు (33) తన పిన్ని వద్ద ఉంటూ గోపాలపట్నంలో పనిచేస్తున్నాడు. ఇటీవల తన మిత్రులు జానీ, గోపాల్‌తో కలిసి బయటకు వెళ్లాడు. అక్కడ గొడవ జరగడంతో జానీని కొట్టాగా.. అతడు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో భయపడిన షణ్ముఖరావు మామిడి తోటలో గురువారం ఉరివేసుకున్నట్లు గోపాలపట్నం పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు.

News January 2, 2026

సామాజిక న్యాయం సాధనకై ఉద్యమిద్దాం: సత్యారెడ్డి

image

సామాజిక న్యాయం అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు సత్యారెడ్డి ఆకాంక్షించారు. సిఐటియు జాతీయ మహాసభ సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవ్ 6వ రోజు సామాజిక న్యాయం సాధనకై ఉద్యమిద్దాం థీమ్‌తో నిర్వహించిన సభా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ యత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకునితీరాలని చెప్పారు.