News May 20, 2024
ఆస్పరిలో ట్రాక్టర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు

ఆస్పరి మండలం శంకరబండ గ్రామ సమీపంలోని బస్టాండ్ దగ్గర ఆగి ఉన్న ట్రాక్టర్ని ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డాక్టర్ డ్రైవర్కి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా.. ఇంకెవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News November 29, 2025
కోటేకల్ రోడ్డు ప్రమాదంపై సీఎం విచారం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో <<18419151>>ఐదుగురు<<>> మరణించడంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి అత్యవసర వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
News November 29, 2025
సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం సహించం: కలెక్టర్

జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడుతూ.. ఏ విద్యార్థి ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. హాస్టళ్లలో పరిశుభ్రత, వంటగది హైజీన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తాజా కూరగాయలతో వేడి భోజనం అందించాలని, తాగునీటి ట్యాంకులను శుభ్రంగా ఉంచాలని హెచ్చరించారు.