News April 9, 2024

ఆస్పరి: మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం

image

మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం చేసిన నిందితుడు నగరుకు చెందిన ముత్తుకూరు రాముడును అరెస్టు చేసినట్టు సీఐ హనుమంతప్ప మంగళవారం తెలిపారు. బిణిగేరికి చెందిన మతిస్థిమితం లేని మహిళను రాముడు ఆదివారం రాత్రి బలవంతంగా అత్యాచారం చేస్తుండగా కొందరు వెళ్లేసరికి అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం బాధితురాలు అన్న ఫిర్యాదు మేరకు ఆస్పరిలో పోలీసులు అరెస్టు చేశారు.

Similar News

News March 22, 2025

కర్నూలు: జిల్లా కోర్టుల్లో “మధ్యవర్తిత్వం” కేంద్రాలు ఏర్పాటు

image

సుప్రింకోర్ట్ ఆదేశాల ప్రకారం అన్ని జిల్లా కోర్టుల్లో మధ్యవర్తిత్వం కేంద్రాలు ప్రవేశ పెట్టాలని తీర్మానించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జి.కబర్ది తెలిపారు. జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్లో న్యాయవాదులకు జరిగిన శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అధితిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కభర్ది హాజరై మాట్లాడారు.

News March 21, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤మినీ గోకులాలను పూర్తి చేస్తాం: జిల్లా కలెక్టర్➤ నంద్యాల: ఫరూక్ సతీమణి చివరి కోరిక.. HYDలోనే అంత్యక్రియలు➤ ఉమ్మడి జిల్లా ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 13కు వాయిదా➤ మంత్రి ఫరూక్ సతీమణి మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం➤ కర్నూలులో TDP నేత దారుణ హత్య.. ఎస్పీ వివరాల వెల్లడి ➤ కర్నూలులో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు➤ మంత్రాలయం: పల్లెల్లో దాహం కేకలు..!➤ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

News March 21, 2025

మినీ గోకులాలను పూర్తి చేస్తాం: జిల్లా కలెక్టర్

image

నెలాఖరులోపు మినీ గోకులాలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కి వివరించారు. శుక్రవారం విజయవాడ నుంచి ఫార్మ్ ఫండ్ ఏర్పాట్లు, సీసీ రోడ్ల నిర్మాణాల పురోగతి, గోకులంల నిర్మాణాల పురోగతిపై డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 1200 లక్ష్యానికి 664 పూర్తి చేసామని కలెక్టర్ వివరించారు.

error: Content is protected !!