News March 1, 2025
ఆహారం నాణ్యతపై తనిఖీలు నిర్వహించాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో ఉన్న వసతిగృహాలలో మంచినీరు, ఆహారం నాణ్యతపై అధికారులు తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ సూచించారు. శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్.ఎస్.ఎమ్.ఇ. సర్వే మార్చి 15నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో అతిసార, మలేరియా, డెంగ్యూ, కలరా వంటి వ్యాధులు ప్రబలకుండా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 3, 2025
మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా సోము వీర్రాజు

బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా అధిష్ఠానం ఆయనను నియమించింది. ఎమ్మెల్యే కోటా ద్వారా మండలిలోకి వచ్చిన వీర్రాజు ఇకపై పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో, ఆయన సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఈ కీలకపదవిని కేటాయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
News November 3, 2025
శుభ కార్యాలప్పుడు గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకు కడతారు?

హిందూ ఆచారాల ప్రకారం.. శుభకార్యాల వేళ ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడుతుంటారు. అయితే ఇది అలంకరణలో భాగమే కాదు. దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయంటున్నారు పండితులు. ‘పండుగలు, శుభ కార్యాల వేళ ఇంటికి ఎక్కువ మంది వస్తుంటారు. వారి వల్ల కలుషితమైన గాలిని మామిడి ఆకులు శుద్ధి చేస్తాయి. ఈ ఆకుల నుంచి వచ్చే గాలిని పీల్చడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మామిడి చెట్టు కల్పవృక్షం’ అని అంటున్నారు.
News November 3, 2025
వేప మందుల వాడకంలో మెళకువలు

వేప నూనె వాడేటప్పుడు సబ్బు ద్రావణం తప్పనిసరిగా వాడాలి. వేపనూనె, ద్రావణాలను సాయంత్రం చల్లితే ఫలితం బాగుంటుంది. ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత వెంటనే పిచికారీ చేయాలి. ఆలస్యం చేయకూడదు. పంటకు కీడుచేసే పురుగుల గుడ్డు పొదిగే దశలో వేప మందును చల్లితే లార్వాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు. బాగా ఎదిగిన లార్వాలు పంటను ఆశిస్తే వేప మందులను నిపుణుల సూచనలతో రసాయన మందులతో కలిపి వాడితే ఫలితాలు బాగుంటాయి.


