News February 8, 2025
ఆహార శుద్ధి పరిశ్రమకు అగ్రిమెంట్

భూపాలపల్లి, ములుగు జిల్లాలోని రైతు సోదరులతో అగ్రిమెంట్ చేయించుకుని ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు భూపాలపల్లి జిల్లా వ్యవసాయ సంక్షేమ సంఘం తరఫున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సొసైటీ అధ్యక్షులు సిరికొండ తిరుపతిరావు తెలిపారు. ఈ జిల్లాలో పండుతున్న పంటలు, రైతుల అభిప్రాయాలను తెలుసుకునే విధంగా శనివారం నాబార్డ్ జీఎం తో సమావేశమయ్యారు. నాబార్డ్ అధికారులు సొసైటీ డైరెక్టర్లు రవీందర్ రెడ్డి, కిరణ్ ఉన్నారు.
Similar News
News December 2, 2025
బయట రాష్ట్రాల ఎర్రచందనం నిల్వలు ఎలా తీసుకొస్తారు..?

శేషాచలం అడవుల నుంచి తరలిపోయిన అరుదైన ఎర్రచందనం అధికారిక లెక్కల ప్రకారం 6 రాష్ట్రాల్లో సుమారు 8వేల టన్నుల నిల్వ ఉంది. ఇందులో కర్ణాటక వేలం వేసుకుందని మంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తెలిపారు. ఆయా రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేందుకు జీవో కూడా తెచ్చామన్నారు. అయితే ఆ ఆదాయాన్ని ఆ రాష్ట్రాలు వదులుకునే పరిస్థితి లేదట. పవన్ పర్యాటన ముగిసి నెల కావస్తున్న తరుణంలో అధికారులు ఏమి చేసారో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 2, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.06 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.57 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.