News February 8, 2025
ఆహార శుద్ధి పరిశ్రమకు అగ్రిమెంట్

భూపాలపల్లి, ములుగు జిల్లాలోని రైతు సోదరులతో అగ్రిమెంట్ చేయించుకుని ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు భూపాలపల్లి జిల్లా వ్యవసాయ సంక్షేమ సంఘం తరఫున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సొసైటీ అధ్యక్షులు సిరికొండ తిరుపతిరావు తెలిపారు. ఈ జిల్లాలో పండుతున్న పంటలు, రైతుల అభిప్రాయాలను తెలుసుకునే విధంగా శనివారం నాబార్డ్ జీఎం తో సమావేశమయ్యారు. నాబార్డ్ అధికారులు సొసైటీ డైరెక్టర్లు రవీందర్ రెడ్డి, కిరణ్ ఉన్నారు.
Similar News
News March 6, 2026
జీలుగుమిల్లి: స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు

తాటియాకులగూడెం సరిహద్దు వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. డీసీఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 598 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, వాహనం, సెల్ ఫోన్లతో పాటు రూ.2.98 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 6, 2026
DMHOపై భూపాలపల్లి ఎమ్మెల్యే ఆగ్రహం

భూపాలపల్లి జిల్లాలో నేడు హెల్త్ మిషన్ 100 కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి DMHO మధుసూదన్ గైర్హాజరవడంతో తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలలో నిర్లక్ష్యం వహిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని అధికారులను మందలించారు.
News March 6, 2026
మాస్ కాఫీయింగ్ జరిగితే చర్యలు: కలెక్టర్

ఏలూరులోని పీడీబీటీ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలను కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని, మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇన్విజిలేటర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆమె సూచించారు.


